
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామం 1998-99 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థి మంతపురి రాజు అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆయనతో చదువుకున్న తోటి విద్యార్థులు సోమవారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన కుమార్తె శరణ్య పేరుపై పోస్ట్ ఆఫీస్ లో రూ.1 లక్ష 20 వేలు పిక్స్ డిపాజిట్ చేసి ఆ కుటుంబానికి డిపాజిట్ కాపీని అందజేశారు.ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.