ఆడ లేక పాత గజ్జేలు తీరు..

– మాజీ సర్పంచ్ వెంకటయ్య గౌడ్..

నవతెలంగాణ – ఊరుకొండ 
టిఆర్ఎస్ పార్టీ మోసపూత చర్యలు మానుకోవాలి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళనే తీసుకువెళ్లి మరొకసారి కండువా కప్పేసి.. మసి పూసి మారడు కాయలు అమ్మినట్లు ఉందని  ఇప్ప పహాడ్ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్  మండల అధ్యక్షులు కుంభగోని వెంకటయ్య గౌడ్, సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పపాడు యాదయ్య లు విమర్శించారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఆడ లేక పాత గజ్జెల తిర్ల కనిపిస్తున్న  టిఆర్ఎస్ ప్రభుత్వం తీరు మోసపూరిత చర్యలు మానుకోకపోతే  తగిన గుణపాఠం తప్పదు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరలేదు అని మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు వెంకటయ్య గౌడ్ విమర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలక్షన్లో సమీపిస్తున్న వేళ  మరోసారి ప్రజలను మోసం చేసేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని టిఆర్ఎస్  పార్టీకి చెందిన వారికి మళ్లీ కండువాలు కప్పి  ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సిద్ధపడుతున్న టిఆర్ఎస్ పార్టీకి  రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతాం అని అన్నారు. టిఆర్ఎస్ పార్టీకి చెందినవారే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు రాబోయే రోజుల్లో దేశంలో గాని.. రాష్ట్రంలో గాని కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం అని వాళ్ళు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పపాడు  కాంగ్రెస్ పార్టీ క్యాడర్ గట్టిగా ఉంది ఉంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదని వారు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దని వారు ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.