హైదరాబాద్ : ప్రముఖ విద్యుత్ ఉపకరణాల సంస్థ సూర్య రోష్నీ పండగ లైటింగ్ కలెక్షన్ను విడుదల చేసినట్లు ప్రకటించింది. ప్రస్తుత పండగ సీజన్ కోసం ప్లాటినా ఎల్ఇడి బల్బ్స్ను, ఇండోర్ డెకరేషన్ కోసం ప్రొఫైల్ స్ట్రిప్ లైట్, స్లిమ్ ట్రిమ్, షైన్ ఎన్క్స్టి డౌన్లైటర్ సహా ఇతర ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చినట్లు ఆ సంస్థ కన్య్సూమర్ డ్యూరెబుల్స్ సిఇఒ జితేంద్ర అగర్వాల్ తెలిపారు. ఆర్అండ్డిలో పెట్టుబడులను కొనసాగించడం ద్వారా మరిన్ని కొత్త ఆవిష్కరణలను తేనున్నామన్నారు. టెక్నలాజీ ల్యాబ్, తయారీలో రూ.25 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామన్నారు.