బీఆర్‌ఎస్‌ లోకి వలసల పర్వం

నవతెలంగాణ-మహాముత్తారం
బీఆర్‌ఎస్‌ లోకి వలసల పర్వం కొనసాగుతోంది. మంగళవారం మహము త్తారం మండలం కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఆ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. యమన్‌పల్లి,జీలపల్లి, ధౌత్‌ పల్లి,పెగడపల్లి గ్రామాలకు చెందిన యువజన నాయకులు మంథని ఎమ్మెల్యే అభ్యర్థి, జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, భూపాలపల్లి జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీ రాకెష్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివధ్ది, సంక్షేమ పథకాల అమలుతో పాటు నియోజకవర్గంలో జెడ్పీ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ చేస్తున్న సేవలకు ఆకర్షితులై ఆయనకు అండగా నిలువాలని బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వారు తెలిపారు. నియోజకవర్గ అభివధ్ది, ఈ ప్రాం తంలోని పేద ప్రజలకు అండగా నిలుస్తున్న జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ గెలుపుకోసం తమవంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు కల్వచర్ల రాజు, రైతుబంధు అధ్యక్షులు మార్క రాము గౌడ్‌, మండల అధికార ప్రతినిధి బోడ బాలాజీ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.