కొత్త కండువాల ఉత్సవం?!

జాతర జాతరగా మెడలో కొత్త కండువాలు!!
కొత్త కండువాల ఉత్సవం
ఎన్నికల ముందు సరి కొత్త పండగ

పదిలమయ్యే భవిష్యత్తుకు మారుతున్న కండువాలు
కొత్త పార్టీలోకి ఆహ్వానం కొత్త కండువా ధారణ

పాత పార్టీ మీది అభిమానం విడిచేసి
మోజుగా ఎన్నికల ముందు కొత్త పార్టీలో చేరిక!
కొత్త కండువాయే గజమాల!
రాజయోగానికి అదృష్ట పరీక్ష!

మెడలు ఆశ్చర్యపోతున్నాయి
ఎన్ని పార్టీల కండువాలు మోసాయో
హుజూర్‌ అంటూ వంగి వంగి పోతున్నాయి
నాయకుల నడకలూ మారిపోతున్నాయి

అదే గొంతు
కొత్త పార్టీల నినాదాలను జపం చేస్తున్నాయి
పదవి ఆశతో జీవితమంతా పార్టీలు మారుడే
అంకిత భావం లేదు

ప్రజలు గమనిస్తున్నారని లేదు
పాము కుబుసం విడిచినట్లు పార్టీలను వదులుడే
ఎన్నెన్ని పార్టీలు మారితే అంత గొప్ప చరిత్ర
– కందాళై రాఘవాచార్య, 8790593638