నవ తెలంగాణ- రామారెడ్డి: మండలంలోని రెడ్డిపేట్, రెడ్డిపేట్ తాండ, మద్దికుంట, రామారెడ్డి, కన్నాపూర్ తాండ లలో శుక్రవారం అంగన్వాడీల ఆధ్వర్యంలో పోషక మాస వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్లు మాట్లాడుతూ… బాలింతలు, కిశోర బాలలు, గర్భిణీలు పౌష్టికాహారాన్ని తీసుకొని ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. అన్న ప్రసన్న, శ్రీమంతాలు, నిర్వహించి, పౌష్టికాహారం పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచులు సంజీవ్, చందర్ నాయక్, నాయకులు రాజేందర్ గౌడ్, సూపర్వైజర్లు ఉమారాణి, సుమతి, అంగన్వాడి టీచర్లు ఇందిరా, పద్మజ, బొమ్మిడి సుజాత, మూడ వెంకటలక్ష్మి, గజ్జల సుజాత, అమృత, గోదావరి, తదితరులు పాల్గొన్నారు.