– వాతావరణంలో మార్పులే కారణం
– దోమలతో విజృంభిస్తున్న డెంగ్యూ
– మండలంలో డెంగ్యూతో ఇద్దరు మృతి
నవ తెలంగాణ మల్హర్ రావు.
మండలంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి.ఇంటింకి ఒక్కరి చొప్పున విష జ్వరాల బారిన పడుతున్నారు.వానాకాలమే అయినప్పటికీ వర్షాలే లేదంటే ఎండలు దంచికొడుతున్నాయి.ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.జలుబు,దగ్గు,జ్వరంతో ఆసుపత్రులకు వెళుతున్నారు. దోమల బెడదతో మండలంలోని తాడిచెర్లలో, ఎడ్లపల్లి, రుద్రారం, కొండంపేట,వళ్లెంకుంట,కుంభంపల్లి, మల్లారం,పెద్దతూoడ్ల, ఆన్ సాన్ పల్లి, నాచారం గ్రామాల్లో మచం పడుతున్నారు. డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నాయి.ఇప్పటికే ఎడ్లపల్లిలో ఇటీవల పెనుగొండ అధ్యశ్రీ ,గురువారం కుంభంపల్లి లో ఏడాది బాలుడు తోటపల్లి స్టీవెన్ పాల్ చికిత్స పొందుతూ హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రిలో మృతిచెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.
రోజుకు వందకు పైగా ఒపి
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రములో రోజుకు వందకు పైగానే జ్వరాలతో ఒపి నమోదు అవుతున్నట్లుగా వైద్య సిబ్బంది చెబుతున్నారు.మండలంలో ఎడ్లపల్లి గ్రామంలో ముగ్గురికి డెంగ్యూ సోకగా ఒక్కరూ మృతి చెందారు.కుంభంపల్లిలో ఒక్కరికి సోకగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. తాడిచెర్లలో ఒక్కరు డెంగ్యూతో ఆసుపత్రిలో చెరినట్లుగా ఆరోగ్య సిబ్బంది పేర్కొన్నారు.
చికిత్స అందిస్తున్నాం….రాజు…ప్రాథమిక వైద్యాధికారి
వ్యాధులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.తాడిచెర్ల ఆసుపత్రికి ఒపి సంఖ్య పెరుగుతోంది. రోజుకు 100 నుంచి 110 వరకు వస్తున్నారు.ఎక్కువగా వైరల్ జ్వరాలు నమోదు అవుతున్నాయి.జ్వరాలతో బాధపడేవారు ఇంటివద్ద ఉండి నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందాలి