– సీపీఐ(ఎం) జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మోకు కనకారెడ్డి
– జనగామ గడ్డపై ప్రజలకు అండగా అనేక పోరాటాలు
– నిరుపేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాల పంపిణీకి ఉద్యమాలు
– ప్రజా గొంతుకకు ప్రజల మద్దతు
నవతెలంగాణ-జనగామ
2023 అసెంబ్లీ నియోవర్గ ఎన్నికల్లో ఈసారి సీపీఐ(ఎం) ఒంటరిగా బరిలో దిగుతు న్న విషయం విధితమే. ఈమేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించ డమే కాకుండా పార్టీ మొదటి విడత అభ్యర్థుల లిస్టు విడుదల చేశారు. కాగా జనగామ జిల్లాకు చెందిన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కన కారెడ్డికి చోటు దక్కింది. జనగామ జిల్లా సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన బరిలో ది గనున్నారు. కొన్నేండ్లుగా జనగామ జిల్లాలో నిరు పేదల కోసం, జిల్లాలో అపరిష్కృతంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి మోకు కనకారెడ్డి అనేక పోరాటాలు చేసి ప్రజల మన్ననలు పొందాడు. ఆయనకు పార్టీ సముచిత స్థానం కల్పించడంతో జిల్లా పార్టీ శ్రేణులు, స్తానిక ప్రజలు హర్షం వ్య క్తం చేస్తున్నారు. జనగామ గడ్డ అనగానే పోరా టాల గడ్డగా చరిత్ర చెబుతున్న విషయం అంద రికి తెలిసిందే. ఇదే గడ్డపై జన్మించిన మోకు కనకారెడ్డి పోరాటాల బిడ్డగా పేరు గడించి నిత్యం పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాడు. 1991లో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేశాడు. నాటి నుంచి నేటి వరకు ఎస్‌ఎఫ్‌ఐ జనగామ డివిజన్ కార్యదర్శిగా, రాష్ట్ర కమిటీ సభ్యులుగా, డీవైఎఫ్‌ఐ వరంగల్ జిల్లా అధ్యక్షులుగా, సీఐటీయూ చేర్యాల డివిజన్ అధ్యక్షుడిగా, రైతు సంఘం జనగామ డివిజన్ కార్యదర్శిగా అనే పోరాటాల్లో భాగస్వామ్యం అయ్యారు. అలాగే రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నియమితులై అనేక పోరాటాలు, ప్రజలకు సేవలు అందించారు. ఇలా అంచలం చలుగా ఎదిగిన ఆయన ప్రస్తుతం జనగామ జిల్లా కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా పార్టీకి, ఉద్యమాలకి అంకితమై పనిచేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. విద్యార్థి, యువజన, కార్మిక, రైతు ఉద్యమాలల్లో ఆయన ముఖ్య భూమిక పోషించారు. ఆయా తరగతుల సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు నిర్వహించడం, ఇండ్లు లేని పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇప్పించడం కోసం, అలాగే భూ పోరాటంలోనూ తనదైన శైలిలో ప్రజలకు చేరువయ్యారు. ఆయన పోరాటాలు, చేసిన సేవలు ఆయనకు ఎన్నికల్లో కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.
ఉద్యమ చరిత్ర
1992-93లో ఎస్‌ఎఫ్‌ఐ ఉద్యమంలో పాల్గొని విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలపై ఉద్యమాలు నిర్వహించారు. 1997- 98లో అప్పిరెడ్డి జనగామ డివిజన్ కేంద్రంలోని ఏకైక ఏబీవీ డిగ్రీ కళాశాలను ప్రభుత్వపరం చేయాలని ఉద్యమాలు చేపట్టి సఫలమయ్యారు. 1999లో సీఐటీయూ మద్దూరు ప్రాంతంలో కార్మిక సమస్యలపై ఉద్యమాలు చేపట్టడంతో పాటు నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. 2002లో రైతు సంఘంలో చేరి రైతు సంఘ బలోపేతానికి ఉద్యమాలు చేపట్టారు. దేవాదుల రిజర్వాయర్ నిర్మాణం కోసం రైతులను క్రోడీకరించి ఉద్యమాలు చేపట్టారు. అనంతరం భూ నిర్వాసితుల సమస్యలపై ఉద్యమించారు. 2022-23లో వర్షాలు పడక రైతులు అల్లాడమే కాకుండా పశువులకు దానా దొరకని దుస్థితిలో రైతులను సమీకరించి గడ్డి సేకరణ కోసం ఉద్యమించారు. అలాగే కరెంటు ఉద్యమాలు చేపట్టి రైతు సమస్యల పరిష్కారానికి కషి చేశారు. 2003-04లో రైతు ఆత్మహత్యలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. 2006-07లో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రైతు ఆత్మహత్యలపై జరిగిన ధర్నా ఆందోళనలో జనగామ ప్రాంతం నుండి 50 మంది రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలను తీసుకెళ్లారు. 2003-04లో ఏసీరెడ్డి నగర్ గుడిసెవాసుల పోరాటంలో కీలకపాత్ర పోషించారు. 2008లో దయానియాలయం సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడడంలో చేపట్టిన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 2016లో జనగామ జిల్లా ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. 2017న జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణం కోసం ఎస్ రెడ్డి నగర్ కాలనీ వాసులను ఖాళీ చేయించి అక్కడ నూతన భవన నిర్మాణానికి సహకరించారు. ప్రభుత్వ అధికారులు ఇచ్చిన హామీ మేరకు యేసు రెడ్డి నగర్ కాలనీవాసులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో నిర్లక్ష్యం చేయగా ఉద్యమించి సాధించడంలో ప్రధాన పాత్ర ఉంది. అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం అనంతరం పేదలకు అప్పగించడంలో అధికారులు నిర్లక్ష్యం చేయడంతో పార్టీ ఆధ్వర్యంలో తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లే చేసిన ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం 2003లో జనగామ జిల్లాలో ప్రధానంగా బచ్చన్నపేట లోని 174 సర్వే నెంబర్లు గల ప్రభుత్వ భూమిని రక్షించడంతోపాటు పేదలకు గుడిసెలు వేయాలని పోరాటంలో వ్యక్తిగా చెప్పవచ్చు. అలాగే జిల్లాలోని పాలకుర్తి మండలంలోని మంచిప్పుల గ్రామంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల ఇప్పించేందుకు గత రెండు సంవత్సరాలుగా ఉద్యమం నడుస్తూనే ఉంది ఆ ఉద్యమ నిరాహారలో కీలక పాత్ర పోషించారు. అలాగే జనగామ పట్టణ సమీపంలోని నెల్లూరులో గ్రామంలో ఏడెకరాలలో పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న అనేక ఉద్యమాలకు అండగా ఉంటూ సీపీఐ(ఎం) పార్టీని మరింత అభివద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు.