రాజస్థాన్‌లో ఎట్టకేలకు

– తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్‌..
– సదర్‌పుర నుంచే సీఎం గెహ్లాట్‌ పోటీ
జైపూర్‌: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలై రెండు వారాలు కావస్తున్నా ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేయని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఎట్టకేలకు ఇవాళ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. తొలి జాబితాలో మొత్తం 33 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఈసారి కూడా సదర్‌పుర అసెంబ్లీ స్థానం నుంచే బరిలో దిగనున్నారు. అదేవిధంగా రాజస్థాన్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ టోంకు నియోజకవర్గం నుంచి, అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషి నత్‌ద్వారా అసెంబ్లీ స్థానం నుంచి, యువ నాయకురాలు దివ్య మాడెర్నా ఓసియన్‌ స్థానం నుంచి, పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ దొతసారా లఛ్‌మన్‌గఢ్‌ అసెంబ్లీ స్థానం నుంచి, డిస్కస్‌ త్రో క్రీడాకారిణి, అంతర్జాతీయ టోర్నీలో గోల్డ్‌ మెడలిస్ట్‌ కష్ణ పూనియా సాదుల్‌పూర్‌ నుంచి బరిలో దిగబోతున్నారు.