ఆర్థిక సహాయం చెక్కు పంపిణీ..

నవతెలంగాణ- కమ్మర్ పల్లి
మండలంలోని బషీరాబాద్ గ్రామానికి చెందిన అంగళ్ల లక్ష్మణ్ కు  ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు చేసిన ఆర్థిక సహాయం చెక్కును గురువారం పంపిణీ చేశారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న లక్ష్మణ్  ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో ప్రభుత్వం   రూ.27వేల ఆర్థిక సహాయం చెక్కును  మంజూరు చేసింది. అట్టి చెక్కును గురువారం లబ్ధిదారుని ఇంటి వద్దకు వెళ్లి సర్పంచ్ సక్కారం అశోక్, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బై కానీ మహేష్  చేతుల మీదుగా  అందజేశారు.ఆర్థిక సహాయం చెక్కు మంజూరుకు కృషి చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డికి లబ్ధిదారుడు, బిఆర్ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బొడ దేవేందర్, తోట అప్పయ్య,  నర్రా మోహన్, రాజు, రమేష్, నర్సయ్య, జయరాం, సాగర్, తదితరులు పాల్గొన్నారు.