అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

– ఆర్థిక సహాయం అందజేస్తున్న సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, 
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండల కేంద్రానికి చెందిన గడ్డం బలరాం గత  కొన్ని రోజుల నుండి అనారోగ్యనికి గురై దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం రోజున మరణించడం జరగింది. దింతో పెద్ద కొడపగల్ సొసైటీ ఛైర్మన్ హన్మంత్ రెడ్డి ఆయన అంత్యక్రియలకు 3000 రూపాయలు అందించినట్లు  తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ లో సంఘ సభ్యులు ఉండటంతో మృతిని అంతక్రియలకు సంఘం తరపు  విరాళం గా అందజేసి నట్లు తెలిపారు. సొసైటీ చైర్మన్ తో పాటు సర్పంచ్ తిరుమల్ రెడ్డి ఉన్నారు.