అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సాయము

నవతెలంగాణ -జమ్మికుంట
మున్సిపల్ పరిధిలోని అబాది జమ్మికుంట కు చెందిన ఆకుల సాయిలు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం బీజేపీ నాయకులు బుర్ర శ్రీనివాస్ గౌడ్  స్థానిక ఎమ్మేల్యే  ఈటెల రాజేందర్  దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే స్పందించి ఎమ్మేల్యే  5వేల రూపాయలు పంపించగా,ఆ కుటుంభానికి శనివారం అందజేశారు.
ఈ కార్యక్రమo లో బీజేపీ నాయకులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ నాయకులు  శ్రీకాంత్ గౌడ్  గండికోట సమ్మన్న, అహ్మద్, సునీల్ గౌడ్, గట్టు రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.