భీమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థినికి ఆర్థిక సహాయం

నవతెలంగాణ -భీమ్‌గల్: భీమ్‌గల్ పట్టణానికి చెందిన  మొండి నితిషాది నిరుపేద కుటుంబం.ఆమె హైదరాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ రెండో  సంవత్సరం చదువుతుంది.భీమ్‌గల్ కి చెందిన భీమ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పర్స లింబాద్రి ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని హైదరాబాద్ లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింభాద్రి, రిటైర్డ్ జిల్లా జడ్డి నిమ్మ నారాయణ చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్డి నిమ్మ నారాయణ స్నేహితుడు అడ్వకేట్ ఎన్.పి రాజు ప్రేరణ పొంది తనవంతు సహాయంగా రూ.25వేలు ఆర్థిక సహాయం చేశారని పర్స లింబాద్రి తెలిపారు.నితిషా చదువుకున్నన్ని రోజులు ప్రతి సంవత్సరం రూ.12 వేల 500 ఆర్థిక సహాయం అందిస్తానని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింభాద్రి మాట్లాడుతూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ గొప్ప డాక్టర్ గా పేరు పొంది,పేదవారికి అండగా ఉండాలని తెలిపారు. మొండి నితిషా భవిష్యత్తులో ఉన్నత చదువుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.తన చదువుకు ఆర్థిక సహాయం అందించిన పర్స లింబాద్రి, ఎన్.పి రాజు కు నితీషా కృతజ్ఞతలు తెలిపి, వారి ఆశయాలను నెరవేరుస్తానని పేర్కొంది. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్.ఈ నిమ్మ సంజీవ్, రిటైర్డు ఎస్పీ జాన్ వెస్లీ, నిజామాబాద్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ అశోక్ కుమార్, రిటైర్డ్ లెక్చరర్ మెట్ట శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.