నవతెలంగాణ-భిక్కనూర్: మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామంలో చాకలి రాంబాయి అనారోగ్యంతో సోమవారం మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అంతక్రియల నిమిత్తం స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ చేత బాధిత కుటుంబ సభ్యులకు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, నర్సింలు, శ్రీనివాస్, భూమలింగం, సిద్ధ రాములు, ప్రభాకర్, బలరాం, నవీన్, తిరుమల్, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.