నవతెలంగాణ-మంగపేట
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మండ లంలోని కమలాపురం గ్రామానికి చెందిన కొరి కొప్పుల సత్యం కుటుంబానికి ఆదివారం ఏటూరు నాగారం మండలానికి చెందిన బ్లడ్ డోనర్స్ సయ్యద్ వహీద్, ఎర్ర మనేని సతీష్ రూ.25,000 ఆర్థిక సాయన్ని అందించారు. కేబుల్ ఆపరేటర్‌గా పనిచేసే సత్యం మూడు సవంత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని దాతల సహాకారంతో సహాయం అందించినట్లు వహీద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం బ్లడ్ డోనర్స్ తడక సుమన్, ఎండీ అజరుద్దీన్, మెరుగు హరీష్ , బండపల్లి సంతోష్, విజయ భాస్కర్, కొయ్యల సతీష్ తదితరులు పాల్గొన్నారు.