నవతెలంగాణ -ఆర్మూర్ : లలిత కళలు విద్యార్థుల మానసిక శారీరక వికాసానికి తోడ్పడతాయని , విద్యార్థులు ఏదో ఒక కళ ను నేర్చుకోవాలని మండల విద్యాధికారి రాజగంగారం అన్నారు . కలోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మండల విద్యా వనరుల కేంద్రంలో మండల స్థాయి కళొత్సవ్ పోటీలు మంగళవారం జరిగాయి. వివిధ విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రదర్శన ఇవ్వవలసి ఉంటుందని న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ప్రముఖ కళాకారుడు కోకిల నాగరాజు ,కృష్ణ వరప్రసాద్ విద్యార్థులకు సూచించారు.
జానపద నృత్యం లో తనుశ్రీ (డీపీ.ఎచ్ స్ మంథని) , శ్రీనిధి (మోడల్ స్కూల్ ). శాస్త్రీయ నృత్యంలో అనూహ్య (కృష్ణవేణి టాలెంట్ స్కూల్,) పాటల పోటీలో అపర్ణ , సూర్య ప్రకాష్ (మోడల్ స్కూల్) విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు