‘ఫినోలెక్స్‌’ తెలంగాణ డీలర్స్‌ సమావేశం

హైదరాబాద్‌ : ఫినోలెక్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌, భవ్య సేల్స్‌ కార్పొరేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఫినోలెక్స్‌ అగ్రి కాలమ్‌ పైపులు తెలంగాణ డీలర్స్‌ సమావేశం జరిగింది. నాగోల్‌లోని జూబ్లీ పార్క్‌ (నవరస హోటల్‌)లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫినోలెక్స్‌ కంపెనీ డీజీఎం సందీప్‌ గౌడ్‌, భవ్య సేల్స్‌ కార్పొరేషన్‌ ప్రొప్రైటర్‌ నల్లపాటి బసంత్‌ లు పాల్గొన్నారు. కంపెనీ ఉత్పత్తుల నాణ్యతను వివరించారు. వాటిని ప్రదర్శించారు. సంస్థకు 43 ఏండ్లకు పైగా అనుభవం ఉన్నదని తెలిపారు. వెయ్యి మందికి పైగా డీలర్లు, 21 వేల మందికి పైగా రిటైలర్లను సంస్థ కలిగి ఉన్నదని చెప్పారు. కంపెనీ సేల్స్‌, ప్రమోషన్స్‌ గురించి కొత్త స్కీమ్స్‌ను ప్రవేశపెట్టారు. కార్యక్రమానికి వచ్చిన డీలర్లు కంపెనీ ఉత్పాదనల వ్యాప్తి, నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నల్లపాటి కళ్యాణ్‌, కె. సుబ్రమణ్యం, రాఘవేంద్ర, రాములుతో పాటు డీలర్లు, కంపెనీ యాజమాన్యం, ప్రతినిధులు, భవ్య సేల్స్‌ కార్పొరేషన్‌ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.