పాక్‌లో గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు..!

– ఉగ్రవాది మసూద్‌ అజార్‌ సన్నితుడు దావూద్‌ మాలిక్‌ హతం..!
లాహోర్‌ : మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌, జైష్‌ ఏ మహ్మద్‌ ఉగ్రవాది మసూద్‌ అజార్‌కు అత్యంత సన్నిహితుడు, లష్కర్‌ ఏ జబ్బార్‌ వ్యవస్థాపకుడు దావూద్‌ మాలిక్‌ హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్‌లోని ఉత్తర వజీరిస్థాన్‌ దావూద్‌ మాలిక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. ముసుగులు ధరించిన వ్యక్తులు అతనిపై కాల్పులు జరుపడంతో ప్రాణాలు కోల్పోయాడు. దావూద్‌ మాలిక్‌ ఓ ప్రైవేట్‌ క్లినికల్‌లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపి.. అక్కడి నుంచి పారిపోయారని తెలస్తున్నది. ఇదిలా ఉండగా.. భారత్‌ మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టుల జాబితాలో ఇటీవల పాక్‌లో హత్యకు గురవుతున్నారు.
ఇప్పటికే పఠాన్‌కోట్‌ దాడి సూత్రధారి షాహిద్‌ లతీఫ్‌తో పాటు ఐఎస్‌ఐ ఏజెంట్‌ ముల్లా బహూర్‌ అలియాస్‌ హౌర్ముజ్‌పై కాల్పులు మతి చెందారు. తాజా లతీఫ్‌కు అత్యంత సన్నిహితుడైన దావూద్‌ మాలిక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దావూద్‌ మాలిక్‌కు లష్కరే జాంగ్వీలతో సంబంధాలున్నాయి.
మసూద్‌ అజార్‌, హఫీజ్‌ సయీద్‌, లఖ్వీ, దావూద్‌ ఇబ్రహీంతో పలువురిని భారత ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించింది. పుల్వామా దాడి తర్వాత బాలాకోట్‌పై భారత సైన్యం వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దావూద్‌ మాలిక్‌ అక్కడే ఉన్నాడు. దాడి నుంచి తప్పించుకున్నట్లు తర్వాత తేలింది. ఈ ఉగ్రవాదులకు పాక్‌ ఐఎస్‌ఐ రక్షణ కల్పిస్తున్నట్లుగా విమర్శలున్నాయి.