పాక్‌లో తీవ్రవాదుల దాడి

– 11 మంది కార్మికులు మృతి
ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో ఆదివారం తీవ్రవాదులు చేసినట్టు అనుమానిస్తున్న దాడిలో 11 మంది కార్మికులు మృతి చెందారు. ప్రధానమంత్రి అన్వర్‌-ఉల్‌-హక్‌ కకర్‌ ఈ విషయాన్ని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌కు సరిహదుల్లో ఉన్న కైబెర్‌ పఖ్తునంఖ రాష్ట్రంలో ఈ దారుణం జరిగింది. నిర్మాణ ప్రదేశానికి కార్మికులను తరలిస్తున్న ట్రక్కు కింద పేలుడు పదార్థాలు అమర్చి దానిని పేల్చివేశారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇంత ఎవరకూ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదు.

Spread the love