ఇండియా మీటింగ్‌కు ఐదుగురు ముఖ్యమంత్రులు

– కూటమి పార్టీల నుంచి 80 మంది రాజకీయ నాయకులు
– 31న ముంబయిలో కూటమి మూడో సమావేశం
– ఏర్పాట్లపై చర్చలు జరుపుతున్న ఎంవీఏ
న్యూఢిల్లీ : ఈనెల 31న ముంబయిలో నిర్వహించనున్న ‘ఇండియా’ కూటమి మూడో సమావేశం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈనెల 31, సెప్టెంబర్‌ 1న జరగనున్న ఈ సమావేశానికి ఐదుగురు ముఖ్యమం త్రులు హాజరుకానున్నారు. అలాగే, 26 రాజకీయ పార్టీలకు చెంది 80 మందికి పైగా నేతలు ఈ సమావేశాని కి రానున్నారు. ఈ విషయాన్ని మహా వికాస్‌ అఘాడి (ఎంవీఏ) నాయకులు వెల్లడించారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ సమావేశం గ్రాండ్‌ హయత్‌ హౌటల్‌లో జరుగుతుం దని వారువివరించారు.ఈ సమావేశానికి సంబంధించి శివసేన (యూబీటీ) చీఫ్‌ ఉద్ధవ్‌ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో సహా ఎంవీఏ సీనియర్‌ నాయకులు, కొంతమంది కాంగ్రెస్‌ నాయకులు ముమ్మర కసరత్తును చేస్తున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యే ప్రముఖులకు విందు ఇచ్చేందుకు ఉద్ధవ్‌ సిద్ధమవుతు న్నారు. ఈ భేటీలో ప్రతిపక్ష ఇండియా కూటమి లోగోను ఆవిష్కరించే అవకా శం ఉన్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతకుము ందు రోజు, ఎంపీలు సుప్రియా సూలే, అనిల్‌ దేశారు, ఎమ్మెల్యే వర్ష గైక్వాడ్‌, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకు డు అంబాదాస్‌ దాన్వే మరియు సంజరు నిరుపమ్‌తో సహా ఎంవీఏ నాయకుల బృందం భద్రతా ఏర్పాట్లపై చర్చించడానికి పోలీసు కమిషనర్‌ వివేక్‌ ఫన్సాల్కర్‌ను కలిసింది.సమావేశానికి సంబంధించిన ఎజెండాను ఢిల్లీలో ఖరారు చేయనున్నట్టు ఎంవీఏ నేతలు తెలిపారు.