– టీయుఎంహెచ్‌ఇయూ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదు శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ను ఎట్టి పరిస్థితిలో అంగీకరించేది లేదని తెలంగాణ యునైటటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయుఎంహెచ్‌ఇయూ – సీఐటీయూ అనుబంధం) స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి పసియుద్దీన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయనీ, ఈ మూడు డీఏలు కలిపి 11 శాతం రావాల్సి ఉందని గుర్తుచేశారు.