
పస్రాలో S.C కాలనీ వరద బాధితులకు , వంట పాత్రలు , ప్లేట్స్, దుప్పట్లు, బట్టలు , సిపిఎం పార్టీ ఆద్వర్యంలో సహాయం చేయడం జరిగింది, ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు, అంబాల పోశాలు మాట్లాడుతూ గత నెల జూలై 26న భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు రావడంతో మండలం లోని అన్ని గ్రామాలు వరదల్లో మునిగి ఇండ్లు దెబ్బతిన్నాయి చాలావరకు ఇండ్లు కొట్టుకు పోయాయి , వరదల్లో కొంతమంది చనిపోవడం జరిగింది, అనేక మంది రైతులు పంట పొలాలు నష్ట పోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు, పోశాలు మాట్లాడుతూ దీనికంతటికి పాలక ప్రభుత్వాలు బాధ్యత వహించి నష్ట బోయి రైతాంగానికి,ఎకరాకు రూ. 50,000, లు, ఇండ్లు మునిగిన, కూలిన వారికి తగినంత నష్ట పరిహారాన్ని చెల్లించాలని, అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు యాభై లక్షల రూపాయలు , ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆది వాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు గొంది రజేష్ , అంబాల మురళి, గాజుల భిక్షం, భూపాలపల్లి రమేష్, సురేష్ , వెంకన్న,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.