చందా మీద బాగ్ తండాలో పశువులకు ఎఫ్ఎండి వ్యాక్సిన్

నవతెలంగాణ – జక్రాన్ పల్లి

మండలంలోని చందా మియాబాగ్ తండాలో పశువులకు ఎఫ్ఎండి వ్యాక్సిన్ వేసినట్టు మండల పశువైద్యాధికారి శిరీష శనివారం తెలిపారు. చిన్న పశువులకు నటల నివారణ మందు వేయడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కిషన్ నాయక్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు పశు వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.