– కొండల్ రెడ్డిని ఆహ్వానించిన నేతలు
నవతెలంగాణ-ఆమనగల్
ఆమనగల్ పట్టణంలో శుక్రవారం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొనాలని కోరుతూ గురువారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీఎం సహోదరులు ఎనుముల కొండల్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా స్థానిక లక్ష్మీ గార్డెన్ లో లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ సొసైటీ, కాంగ్రెస్ పార్టీ సంయుక్తల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరంలో వారు కొండల్ రెడ్డిని ఆహ్వానించినట్లు వారు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో రేవంత్ రెడ్డి మిత్ర మండలి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆసిఫ్ అలీ, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు మండ్లి రాములు, పట్టణ అధ్యక్షులు వస్పుల మానయ్య, సీనియర్ నాయకులు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.