నయన సౌందర్యానికి

For my beautyకళ్ళు చాలా సున్నితమైనవి కాబట్టి మార్కెట్లో దొరికే ఏం క్రీం పడితే ఆ క్రీం రాయటం మంచిది కాదు. ఇలా చేస్తే కళ్ళు ఇన్‌ఫెక్షన్‌ బారిన పడే ప్రమాదం ఉంది. అదీ కాక ఏవైనా క్రీములు పడకపోతే కళ్ళు పోయే ప్రమాదమూ ఉంది. అందుకే వైద్యుని సలహాతో వాడాలి. వీటికి బదులుగా కొన్ని ప్యాక్‌లు ఇంట్లోనే చేసుకోవచ్చు. అవెలాగంటే…
అర టీస్పూన్‌ కీరా రసంలో కొద్దిగా రోజ్‌ వాటర్‌ కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ళకు రాసుకుని అరగంటసేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కళ్ళు ఆకర్షణీయంగా ఉంటాయి.
కళ్ళకు విశ్రాంతి ఎంతైనా అవసరం. తగినంత ఎక్కువ సేపు నిద్ర పోవడం వల్ల కళ్ళకు రెస్ట్‌ దొరికి తాజాగా కనపడతాయి.
గ్లాస్‌ నీటిలో ఉసిరిపొడి నానబెట్టి, ఈ మిశ్రమంతో ఉదయాన్నే కళ్ళను కడుక్కుంటే కళ్ళు తాజాగా మెరుస్తాయి. ఉసిరి అన్ని విధాలా ప్రయోజనకారే.
కళ్ళ చుట్టూ ఉండే ముడతలు పోవాలంటే పాల మీగడతో కళ్ళ చుట్టూ మసాజ్‌ చేసుకుంటే ముడతల నుండి విముక్తి పొందవచ్చు.
నిద్రలేమి, అలసట, ఇతర సమస్యల కారణంగా కళ్లు ఉబ్బినట్టు కనిపిస్తుంటాయి కొందరికి. ఇలాంటి వారు గుడ్డులోని తెల్ల సొనను కళ్ల అడుగున రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత కడిగేసుకుంటే ఆ సమస్య అదుపులోకి వస్తుంది.