కేసీఆర్ ఉద్యమమా? : వైఎస్ షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఢిల్లీ హక్కుల కోసం కేంద్రం మెడలు వంచుతానంటూ సీఎం కేసీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. పక్క రాష్ట్రాల ప్రయోజనాలకోసం పోరాడే కేసీఆర్ స్వరాష్ట్ర ప్రయోజనాలకోసం ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ కోసం పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ ఎంపీలు మాట్లాడకుండా ఉంటున్నారని విమర్శించారు. బీజేపీ ఇస్తానన్న రెండు కోట్ల ఉద్యోగాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకురావటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పేర్కొ న్నారు. మైనారిటీ, గిరిజన రిజర్వేషన్లను పెండింగ్‌లో ఎందుకు పెట్టారో చెప్పా లని ప్రశ్నించారు.