టీఎస్‌ఎంసెట్‌ (బైపీసీ) ప్రవేశాలకు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
టీఎస్‌ఎంసెట్‌ (బైపీసీ)-2023 ప్రవేశాల తొలి దశ కౌన్సిలింగ్‌ కోసం ఆదివారం నాటికి 16,717 మంది ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకున్నట్టు టీఎస్‌ఎంసెట్‌ (బైపీసీ) -2023 అడ్మిషన్స్‌ కన్వీనర్‌ తెలిపారు. ఈ మేరకు కన్వీనర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించి సెప్టెంబర్‌ 4, 5 తేదీల్లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, 4 నుంచి 7 తేదీల వరకు ఆప్షన్ల ఎంపిక ఉంటుంది. 11న సీట్లను కేటాయిస్తారు.