మీ బంగారు రిటైర్మెంట్ భవిష్యత్తు కోసం – నేషనల్ పెన్షన్ సిస్టమ్

నవతెలంణ -హైదరాబాద్: భవిష్యత్తు కోసం ఎంతో కొంత దాచుకోవడం అవసరమని భారతీయులం విశ్వసిస్తాం. సాధారణంగా ఇంటి కొనుగోలు అలాగే తమ పిల్లల జీవితాల్లో కీలక మైలురాళ్లు వంటి విద్య, వివాహం తదితర దీర్ఘకాలిక లక్ష్యాలకు అవసరమయ్యే డబ్బును సమకూర్చుకునేందుకు తల్లిదండ్రులు కొంత నిధిని ఏర్పాటు చేయడం లాంటివి సర్వసాధారణంగా పాటిస్తుంటాము. మన సంస్కృతి రీత్యా వృద్ధాప్యంలో కుటుంబంపై ఆధారపడటమనేది అలవాటుగా ఉండటం వల్ల రిటైర్మెంట్ అవసరాల కోసం ప్రణాళిక వేసుకునే విషయానికొస్తే మాత్రం చాలా సందర్భాల్లో తర్వాత చూద్దాంలే అని పక్కన పెట్టేస్తుంటాం. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబమనేదే దాదాపుగా కనిపించడం లేదు. కాబట్టి తగు ఆర్థిక ప్రణాళికతో మన గోల్డెన్ ఇయర్స్ కోసం సిద్ధం కావాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఉద్యోగుల భవిష్య నిధి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, లైఫ్ ఇన్సూరెన్స్, మ్యుచువల్ ఫండ్స్, నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) మొదలైన సాధనాలు ఎన్నో ఉన్నాయి. సర్వీస్ ప్రొవైడర్ ఎంచుకున్న పెట్టుబడి ప్లాట్ఫామ్‌ను బట్టి వీటిలో ఒక్కో దానిలో ఒక్కో రకమైన ప్రయోజనం, రాబడులు ఉంటాయి. పలు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, మనం వివిధ రకాల ప్లాన్లను సముచితంగా ఉపయోగించుకోగలగాలంటే ఒక్కో దాని గురించి కూలంకషంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ద్రవ్యోల్బణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని మన ప్రస్తుత సంపాదనకు సరిసమానమైన స్థాయిలో ఆదాయం అందుకునేలా తగినంత నిధిని ఏర్పాటు చేసుకోవడమనేది లక్ష్యంగా ఉండాలి.
రిటైర్మెంట్ కోసం నిధిని ఏర్పాటు చేసుకునేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు ఏమిటి?
సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలి & దీర్ఘకాలిక కోణంలో ఆలోచించాలి: చాలా వరకు ఆర్థిక సాధనాలన్నీ కూడా దీర్ఘకాలికంగా పెట్టుబడులు కొనసాగించడం వల్ల వచ్చే ప్రయోజనాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటాయి. ఎందుకంటే పెట్టుబడులను దీర్ఘకాలికంగా కొనసాగించడం వల్ల కాంపౌండింగ్ మహిమ ప్రయోజనాలను అత్యధికంగా పొందవచ్చు. మీరు 25 సంవత్సరాల పాటు ఏడాదికి రూ. 50,000 చొప్పున ఆదా చేస్తూ వెళ్తేవార్షికంగా 8% రాబడి రేటు ఉంటుందని అంచనా వే​_​_స్తే దాదాపు రూ. 40 లక్షల నిధి పోగవుతుంది. అదే మీరు 5 ఏళ్లు తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభిస్తే మీ నిధి రూ. 15 లక్షల మేర తగ్గిపోయి రూ. 25 లక్షలకు మాత్రమే పరిమితమవుతుంది. ఒకే పెట్టుబడిపై సమయ ప్రభావం ఎలా ఉంటుందనేది ఈ ఉదాహరణ ద్వారా తెలుస్తుంది. కాంపౌండింగ్ మహిమ అంటే ఇదే. కాబట్టి మీరు ఎంత ముందుగా ప్రారంభిస్తే అంత మంచిది.
అధిక రాబడులను అందించే సాధనాన్ని ఎంచుకోండి: దీర్ఘకాలికంగా ద్రవ్యోల్బణానికి మించిన రాబడులు అందించగలిగే సామర్ధ్యాలున్న సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ముఖ్యం. దీర్ఘకాలికంగా ఒక పెట్టుబడి సాధనంగా ఈక్విటీలో (మ్యుచువల్ ఫండ్స్, ఎన్పీఎస్ వంటి ప్రొఫెషనల్గా నిర్వహించబడే స్టాక్స్ బాస్కెట్ వంటివి)లో ఇన్వెస్ట్ చేస్తే, కాలక్రమేణా పెట్టుబడి పెట్టిన అసలును నష్టపోయే రిస్కులు తగ్గడంతో పాటు రెండంకెల స్థాయిలో చక్రీయంగా రాబడులు అందుకునే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. 1995 నుంచి కాలవ్యవధిని తీసుకుని, నిఫ్టీ 50 వంటి పాసివ్ స్టాక్స్ బాస్కెట్ను ఏ పదేళ్ల వ్యవధికైనా పరిశీలిస్తే, మీరు ఏడాదికి రెండంకెల స్థాయిలో రాబడులు అందుకునే సందర్భాలు నాలుగింటిలో మూడు ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మీరు అసలు డబ్బు పోగొట్టుకునే పరిస్థితే ఎదురయ్యేది కాదు. యాక్టివ్ మేనేజ్డ్ ఫండ్ను ఎంచుకుంటే ఈ అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయి. కాబట్టి పోర్ట్ఫోలియో దీర్ఘకాలికంగా ద్రవ్యోల్బణానికి మించిన రాబడులు అందించేలా ఈక్విటీల్లోనూ ఇన్వెస్ట్ చేసే సాధనాన్ని ఎంచుకోవడం శ్రేయస్కరం.
తక్కువ చార్జీలు: మార్కెట్ ఆధారిత పెట్టుబడులపై ఫండ్ మేనేజర్లు చార్జీలు విధిస్తారు. కాబట్టి, తక్కువ చార్జీలు ఉండే సాధనాన్ని ఎంచుకోవడం మంచిది. దీనివల్ల మీ పెట్టుబడిని గరిష్టంగా పెంచుకునేందుకు వీలవుతుంది. 25 ఏళ్ల వ్యవధిలో మీ డబ్బు నిర్వహణ వ్యయం 1 శాతం అధికంగా ఉన్నా, మీ నిధి పరిమాణం 10-15 శాతం తక్కువకు పరిమితమవుతుంది. మరో విధంగా చెప్పాలంటే ఫండ్ నిర్వహణ వ్యయాలను మిగుల్చుకోవడం వల్ల, స్థూలంగా 8 శాతం వార్షిక రాబడి రేటు చొప్పున లెక్కేసినా, మీ నిధి పరిమాణాన్ని మరో 12-15 శాతం పెంచుకోవచ్చు.
తక్కువ జోక్యం: మార్కెట్ ఒడిదుడుకులకు లోనైనప్పుడు పెట్టుబడులను నిర్వహించుకోవడానికి అపార అనుభవం అవసరమవుతుంది. అంతే గాకుండా వయస్సు పెరిగే కొద్దీ ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. సాధారణ వ్యక్తులకు ఇదంతా చేయడం అంత సులభమైన వ్యవహారం కాదు. ఇటు మార్కెట్ ఒడిదుడుకులను అటు పెరిగే వయస్సుకు అనుగుణంగా అసెట్ కేటాయింపులను సమర్ధంగా నిర్వహించగలిగే సాధనమనేది సురక్షితమైన, నిరాటంకమైన విధంగా నిధిని సమకూర్చుకోవాలనుకునేవారికి మంచి ఎంపిక కాగలదు.
పక్షపాత ధోరణులను నియంత్రించుకోవడం: ఈక్విటీ సాధనంలో రాబడులు అందుకోవాలంటే, మీ చుట్టుపక్కల ఉండే రణగొణ ధ్వనులను పట్టించుకోకుండా, మార్కెట్లో అన్ని వేళలా పెట్టుబడిని కొనసాగించడం చాలా ముఖ్యం. మీ రిటైర్మెంట్ అవసరాల కోసం నిధిని ఏర్పర్చుకోవాలనే లక్ష్యం కోసం మీరు తప్పనిసరిగా పెట్టుబడులను కొనసాగించేలా చూసే విధమైన, అలాగే మీ లక్ష్యానికి మీరు కట్టుబడి ఉండేలా చేసే విధమైన సాధనం ఉండాలి. దీర్ఘకాలిక సంపద సృష్టికి అడ్డంకులుగా నిలిచే మానవ భావోద్వేగాలు, పక్షపాత ధోరణులను నియంత్రించుకునేందుకు ఇలాంటిది ఉపయోగపడుతుంది.
పన్ను ప్రయోజనం: పెట్టుబడులపైన, పోగుపడిన నిధిపైన, దాన్ని ఉపసంహరించుకునేటప్పుడుఇలా పెట్టుబడి పెట్టే క్రమంలో వివిధ దశల్లో పన్నుపరమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇవే పన్నుల అనంతరం మీకు వచ్చే ఆదాయాన్ని నిర్దేశించే కీలకమైన అంశాలు. వివిధ సాధనాలు వివిధ రకాలుగా పన్ను ప్రయోజనాలు అందించగలవు. ఎన్పీఎస్ లేదా ఈపీఎఫ్ వంటి సాధనం, పెట్టుబడి ప్రస్థానంలో, అంటే పెట్టుబడి పెట్టేటప్పుడు (నిర్దిష్ట పరిమితి వరకు), పోగుపడిన మొత్తంపై అలాగే మెచ్యూరిటీ సమయంలోనూ, పన్ను ఆదా/మినహాయింపు ప్రయోజనాలు అందిస్తుంది. వివిధ సాధనాల మేళవింపుపై నిర్ణయం తీసుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాల్లో ఇది కూడా ఒకటి.
పైన పేర్కొన్న అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న మీదట, ఈ అర్హతలన్నీ కలిగి ఉండేలా తీర్చిదిద్దిన సాధనం ఒకటి ఉంది. అదే నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్). ఇందులో ఈ కింది ప్రయోజనాలు ఉంటాయి.
1.   ఫండ్ ఎంపిక స్వేచ్ఛఈక్విటీ, కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు అలాగే మీ అభీష్టం ప్రకారం వీటి మేళవింపు (యాక్టివ్ చాయిస్ ఆప్షన్లో) లేదా వయస్సు మరియు రిస్కు సామర్ధ్యాల ప్రాతిపదికన ముందే నిర్ణయించిన విధంగా కేటాయింపులు జరిపే ఆటో మోడ్ (ఆటో చాయిస్ ఆప్షన్లో)
2.   వయస్సును బట్టి ఆటోమేటిక్గా రీబ్యాలెన్స్ కావడం (ఆటో చాయిస్ ఆప్షన్కింద)
3.   తక్కువ చార్జీలు (0.10% కన్నా తక్కువదాదాపు ఇతరత్రా పోల్చతగిన యాక్టివ్ మేనేజ్డ్ ఫండ్స్తో చూస్తే ఫండ్ నిర్వహణ వ్యయంలో దాదాపు 1/15 వంతు )
4.   దీర్ఘకాలికంగా పెట్టుబడిని కొనసాగించడం వల్ల కాంపౌండింగ్ మహిమ ప్రయోజనాలు పొందడం.
5.   పన్ను ప్రయోజనం: సెక్షన్ 80 సీసీడీ (2) కింద వేతన జీవులకు ఎన్పీఎస్ గణనీయంగా పన్ను ప్రయోజనాలు అందిస్తుంది: జీతం బేసిక్లో 10 శాతం (+డీఏ, వర్తిస్తే) మొత్తాన్ని కార్పొరేట్ ఎన్పీఎస్ మార్గంలో ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, తద్వారా ఉద్యోగి వేతన శ్లాబ్ ప్రకారం చెల్లించాల్సిన పన్ను భారం పడకుండా చూసుకోవచ్చు. వేతన జీవులు కాని వారి విషయానికొస్తే, పాత విధానం ప్రకారం ఇతర ట్యాక్స్ సేవింగ్ సాధనంలో ఇన్వెస్ట్ పరిమితి రూ. 1.5 లక్షలు దాటి ఎన్పీఎస్లో రూ. 50,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. సెక్షన్ 80 సీసీడీ (1బీ) కింద ఇందుకు అర్హత కలిగి ఉండే సాధనం ఎన్పీఎస్ ఒక్కటే.
6.   పెన్షన్ ఫండ్ మేనేజర్లు ఇన్వెస్ట్ చేయదగిన సాధనాలకు సంబంధించి పీఎఫ్ఆర్డీఏ (PFRDA) స్పష్టంగా నిర్వచించిన పటిష్టమైన రిస్క్ నిర్వహణ ఫ్రేమ్వర్క్
7.   నిశితమైన నియంత్రణ సంస్థ పర్యవేక్షణ/అజమాయిషీ అలాగే పెన్షన్ ఫండ్ మేనేజర్ల పనితీరును సరైన దారిలో ఉంచడం
ఆయా ఫండ్స్ అందించిన రాబడుల ఆధారంగా మీరు మీ పెన్షన్ ఫండ్ మేనేజర్ను ఎంపిక చేసుకోవచ్చు. npstrust.org.inలో ఈ సమాచారం సులభంగా అందుబాటులో ఉంటుంది. మీ రిటైర్మెంట్ సమయాన్ని సౌకర్యవంతంగా గడిపేందుకు  వీలైనంత త్వరగా పెట్టుబడులను ప్రారంభించండి, వాటిపై మెరుగైన రాబడులు అందుకోండి.

Spread the love
Latest updates news (2024-07-07 05:21):

270 blood aQv sugar reading | what is 9sX the normal blood sugar level for women | cRi blank blood sugar log | cat normal blood sugar level DPU | can fasting make HKX your blood sugar go up | blood sugar monitor every 5 minutes SJl | symptoms of high blood sugar MLO problems | pRL what can cause blood sugar to drop suddenly | blood sugar 360 iMn random | is being dizzy a symptom 6TM of low blood sugar | oBQ blood sugar high even with low carb diet | blood sugar at 70 4AG | if your lJE blood sugar is too low what happens | blood sugar jJg 500 diabetes | fasting time for blood sugar NYx level | will coffee raise my blood sugar EBD | what is the normal blood sugar level for a male V9U | diabetes and jh8 blood sugar | high 3nV blood sugar low white blood cells | blood sugar sex magik jCN | best way to 1tm et to keep blood sugar levels | sharp stomach pain and blood sugar MAq | is cinnamon tea good for lowering blood amJ sugar | blood xE9 sugar level minimum and maximum | blood sugar 154 an hour vaf after eating | what level of blood sugar after vRb meal | signs that your blood HWJ sugar is high or low | does brown rice syrup cause Ezg high blood sugar levels | prediabetic fasting blood sugar xVm levels | genuine overnight blood sugar | what happens in Qqh the body when blood sugar drops | can i test k76 my blood sugar without a doctor | how to average daily blood sugar levels Kow | what should blood sugar be after eating r7Q uk | fasting Esc blood sugar level 97 mg dl | do drugs affect otJ your blood sugar | blood sugar reducing vegetables Crw | what do you do 0Tf for high blood sugar | how to lower blood sugar after exercise Gli | diabetes EUM how to lower blood sugar | icd 10 jvS code for fasting blood sugar | blood sugar 1W8 levels test | blood sugar 274 after 01b eating | safe blood sugar levels for lRM non diabetics | blood sugar level eP2 age 70 to 80 | avocado effect on PB6 blood sugar | does aspartame cause blood UnN sugar spikes | can you use aMv expired blood sugar strips | 165 blood sugar 0Ka level high | nhs blood sugar i9J level chart