రామమందిరానికి విదేశీ విరాళాలు

– అనుమతించిన కేంద్రం :ఆలయ ట్రస్ట్‌ వెల్లడి
న్యూఢిల్లీ : అయోధ్యలోని రామమందిర నిర్మాణం కోసం విదేశీ విరాళాలు స్వీకరించడానికి కేంద్ర హౌం శాఖ అనుమతి నిచ్చింది. ఈ విషయాన్ని ఆలయ ట్రస్ట్‌ జనరల్‌ సెక్రెటరీ చంపత్‌రారు వెల్లడించారు. విదేశీ భక్తుల నుంచి విరాళాలు స్వీకరించాలంటే ఫారెన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) అనుమతి తప్పనిసరి అని చెప్పారు. కేంద్ర హౌం శాఖ నుంచి ఈ అనుమతి లభించడంతో ఇకపై విదేశీ భక్తుల నుంచి విరాళాలు స్వీకరిస్తామని వెల్లడించారు. ఎవరైనా విదేశీ భక్తులు విరాళాలు ఇవ్వాలనుకుంటే ఢిల్లీలోని మెయిన్‌ బ్రాంచ్‌లో గల ట్రస్ట్‌ అకౌంట్‌లో జమ చేయవచ్చని సూచించారు.