అటవీ భూమి నీకింత నాకింత సరిహద్దు గ్రామాలు

– పోడు భూముల వల్ల మూడు గ్రామాల మధ్యలో చిచ్చు
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
గిరిజనులతో మాట్లాడుతున్న అటవీ, పోలీస్ సిబ్బంది మండలంలోని పోచారం విట్టల్ వడి విట్టల్ వాడి తాండ లో చిచ్చు రేపిన అటవీ భూమి  రెండు రోజులుగా నాదంటే నాది అని గిరిజనుల ఘర్షణ పాల్పడంతో అటవీశాఖ అధికారులకు తలనొప్పిగామారింది. మండలంలోని ఆయా గ్రామాల్లో వందల ఎకరాల అటవీ భూమి వ్యాప్తించి ఉంది.ఈ అటవీ భూముల్లో కొంతకాలంగా రైతులు కబ్జాలో ఉన్నారని ప్రభుత్వం ఇటీవల పోడు భూముల పట్టాలు ఇచ్చింది.దీనితో పట్టాలు రానివారు ఇక కొన్ని రోజులకై అటవీ భూమి పట్టాలు వస్తాయనే ఉద్దేశంతో అటవీ భూములను అక్రమాలకు తెగబడుతున్నారు.దీనితో ప్రశాంతంగా ఉండాల్సిన గ్రామాలు తండాలలో ఘర్షణ వాతావరణం మొదలైంది.ఈ ఘర్షణ మండలంలోని పోచారం విట్టల్వాడి విట్టవాడి తండా పరిధిలో చోటుచేసుకుంది.పోడు భూములకు పట్టాలు రాకపోవడంతో అటవీ భూములను ఆక్రమణ మండలంలోని పోచారం విట్టల్వాడి విట్టల్ వాడి తండాలో జుక్కల్ ఫారెస్ట్ రేంజ్ కింద 354,355 గల సర్వే నంబర్ పరిధిలో సుమారు 1300 ఎకరాల అటువైపు పై మైదానమైన ప్రాంతం ఉంది.దీనితో ఇటీవలనే ప్రభుత్వం ఇందులో కొందరికి పోడు భూముల పట్టాలను పంపిణీ చేశారు ఇక తమకు కూడా ప్రభుత్వం నుండి రానున్న రోజుల్లో పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఉద్దేశంతో ఆయా గ్రామ లకు చెందిన గిరిజనులు రాత్రి వేళలో ట్రాక్టర్లతోటి తమకున్న ప్రాంతాన్ని సరిహద్దులుగా నిర్ణయించుకొని దున్నేస్తున్నారు.సుమారు 1300 ఎకరాల భూమిని మూడు గ్రామాలకు చెందిన గిరిజనులు నాదంటే నాది అని దున్నేస్తున్నారు గ్రామాల నడుమున అటవీ భూమి పంచాయతీ పోచారం విఠల్వాడి విట్టల్ వాడి తండాల్లో ఉన్న భూములను ఎవరికి వారే ఆయా గ్రామాల నడుమ తమ భూముల్లో ముళ్ళ కంపలతో సరిహద్దులు ఏర్పాటు చేసుకుంటున్నారు మూడు గ్రామాల ప్రజలు వాదన చేసుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది మూడు గ్రామాల గిరిజనులు వాగ్వాదం చేసుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అటవీశాఖ సిబ్బంది వారిని అక్కడి నుండి పంపించారు ఇట్టి భూమిపై ఎవరి అధికారం లేదని అటవీశాఖ పోలీస్ శాఖ గిరిజనులకు గట్టిగా హెచ్చరించడంతో కాస్త గొడవ సద్దుమణిగింది.