ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపుకోసం కమిటీల ఏర్పాటు

నవతెలంగాణ- భువనగిరిరూరల్‌
భువనగిరి మండలంలో కునూరు గ్రామంలో రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం, భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్‌ రెడ్డి గెలుపు కోరుతూ ఆ గ్రామంలో కార్యకర్తలతో బూతు స్థాయి, వార్డు స్థాయి కమిటీలను వేశారు. ఈ కార్యక్రమానికి ఇన్‌చార్జిలు నరాల వెంకటస్వామి యాదవ్‌, పుట్ట వీరేష్‌ యాదవులు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు పాశం మహేష్‌, గ్రామ సర్పంచ్‌ మురళి,మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మెన్‌ అబ్బగాని వెంకట్‌, మండల యూత్‌ అధ్యక్షులు నాగేంద్రబాబు, మదర్‌ డెయిరీ చైర్మెన్‌ నుచు మల్లేష్‌, వార్డు సభ్యులు,శ్రీను,శేఖర్‌,కోఆప్షన్‌ కర్ణాకర్‌, మాజీ ,గ్రామశాఖ అధ్యక్షులు, నుచు రమేష్‌,వడ్లకొండ వెంకటేష్‌,యూత్‌ అధ్యక్షులు భాను,,యూత్‌ నాయకులు, కార్యకర్తలు, బుగ్గ కానక రాజు,,బుగ్గ రమేష్‌, బతిని కుమార్‌ పాల్గొన్నారు,