తెలంగాణ యూనివర్సిటీ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు..

నవతెలంగాణ- డిచ్ పల్లి: తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్  వాకాటి కరుణ ఆదేశాల మేరకు  రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్.యం యాదగిరి  వర్సిటీలో యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.
సోమవారం యూనివర్సిటీ లోని రిజిస్ట్రార్ చాంబర్లో ప్రొఫెసర్ ఎం యాదగిరి యాంటీ ర్యాగింగ్ పోస్టర్ను విడుదల చేస్తూ విద్యార్థులు శారీరిక, మానసిక, లైంగిక, ఒత్తిడికి గురి చేస్తే  చట్టరీత్యా నేరస్తులు అవుతారని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి,  సమాజానికి ఉపయోగపడేలా గాని వినాశానికి ఉపయోగపడటం క్షమించరానిదని  పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విజ్ఞాన అభివృద్ధికి ముందడుగులు వెయ్యాలని సూచించారు.విద్యార్థుల భవిష్యత్తు కొరకు యాంటీ  ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కమిటీకి తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సర్ వకాటి కరుణ చైర్మన్ గా వ్యవహరిస్తారు.
రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి వైస్ చైర్మన్ గా, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి కన్వీనర్ గా, డాక్టర్ కే రవీందర్ రెడ్డి, డాక్టర్ ఎం. బీ. బ్రమరాంబిక, డాక్టర్ జి బాలకిషన్, డాక్టర్ ఏ. పున్నయ్య, డాక్టర్ గుల్ ఈ రానా, డాక్టర్ మహేందర్ ఐలేని, డాక్టర్ కే కిరణ్మయి, డాక్టర్ కిరణ్ రాథోడ్ సభ్యులు గా నియమించారు. విద్యార్థులు ఎలాంటి  అసౌకర్యానికి గురైన కమిటీ సభ్యులకు వేంటనే సమాచారం అందించాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి పేర్కొన్నారు.