బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే యెన్నం సస్పెండ్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆయన్ని సస్పెండ్‌ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకుందనీ, సస్పెన్షన్‌ తక్షణం అమల్లోకి వస్తుందని వివరించారు.