నవతెలంగాణ-పరిగి
వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి తండ్రి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి శుక్రవారం రాత్రి అకాల మరణం చెందాడు. శుక్రవారం రాత్రి భోజనం చేసి ఇంట్లో టీవీ చూస్తుండగా అకస్మాత్తుగా పడిపోవటంతో ఆయనను పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆస్పత్రి నుంచి పరిగిలోని సొంత నివాసానికి మృతదేహాన్ని తరలించారు. ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, కొప్పుల హరీశ్వర్ రెడ్డి సతీమణి గిరిజరెడ్డి కన్నీరుమున్నీరు అయ్యారు. బీఆర్‌ఎస్ శ్రేణులు శోకసముద్రంలో మునిగిపోయారు.1994 నుంచి 2009 వరకు పరిగి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. 2001 నుంచి 2003 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. 2012లో టీడీపీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటూ బీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశాడు. 2014 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి పరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.