మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

Former Deputy Speaker Koppula Harishwar Reddy The funeral is complete– అధికారిక లాంఛనాలతో నిర్వహణ
– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌, మంత్రులు
నవతెలంగాణ-పరిగి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ డిప్యూటీ స్పీకర్‌, మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం వికారాబాద్‌ జిల్లా పరిగిలో ముగిశాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించింది. అంతకు ముందు శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మం త్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు తదితరులు హరీశ్వర్‌ రెడ్డి మృతదేహానికి నివాళి అర్పించారు. శుక్రవారం రాత్రి హరీశ్వర్‌రెడ్డికి శ్వాస ఆడకపోవడంతో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో ఆయన తుది శ్వాస విడిచారు. కార్యకర్తల సందర్శనార్థం మృతదేహాన్ని శనివారం ఉదయం నుంచి పరిగిలోని ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి నివాసంలో ఉంచారు. కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంతిమయాత్ర మధ్నాహ్నం మూడున్నర గంటల తర్వాత ప్రారంభమైంది. పరిగి పట్టణ కేంద్రంలోని పల్లవి డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిం చింది. రెండు నిమిషాలు మౌనం పాటించి, పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. అనంతరం హరీశ్వర్‌రెడ్డి తనయుడు.. ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి తండ్రి చితికి నిప్పంటించారు. ఈ అంత్యక్రియలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మృతిపట్ల రేవంత్‌, జానారెడ్డిల సంతాపం
పరిగి మాజీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ హరీశ్వర్‌రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కె జానారెడ్డి సంతాపం తెలిపారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వాసి రెడ్డి (రామాయంపేట) మృతి పట్ల కూడా వారు సంతాపం తెలిపారు.
కాంగ్రెస్‌ గూటికి బీఆర్‌ఎస్‌ నేతలు
తాండూరు మున్సిపల్‌ మాజీ చైర్మెన్‌ డాక్టర్‌ సంపత్‌కుమార్‌, వ్యాపార వేత్త పి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర నేతలు కాంగ్రెస్‌లో చేరారు. శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, రేవంత్‌…కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ మార్యాదపూర్వకంగా రేవంత్‌ను కలిశారు.
నివాళులర్పించిన స్పీకర్‌, మంత్రులు
కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మృతదేహానికి ప్రము ఖులు నివాళి అర్పించారు. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హరీశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డిని మంత్రి కేటీఆర్‌ ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. హరీశ్వర్‌రెడ్డి ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించారన్నారు. అలాంటి నాయకుడు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని చెప్పారు. మంచి వ్యక్తిత్వం కలిగిన మచ్చలేని నాయకుడని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. రైతుగా, ఉప సర్పంచ్‌గా జీవితం ప్రారంభించి అంచలంచె లుగా ఎదిగారని గుర్తుచేశారు. డిప్యూటీ స్పీకర్‌గా, ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అందర్నీ ఆప్యాయంగా పలికరించే వారని కొనియాడారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. కొప్పుల హరీశ్వర్‌రెడ్డి రాజకీ యంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అన్నారు.