నవతెలంగాణ- మోపాల్
మంగళవారం రోజున మాజీ ఎమ్మెల్సీ, మాజీ టీటీడీ బోర్డు మెంబర్ అరికెల నర్సారెడ్డి పుట్టినరోజును కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తహర్బిన్ హుందాన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అరికెల నర్సారెడ్డి మాట్లాడుతూ తన వచ్చే పుట్టిన రోజు నాటికి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు మరియు కర్షకులకు మంచి రోజులు రాబోతున్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏక మొత్తంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామనీ, అలాగే 500 రూపాయలకే సిలిండర్ను అందిస్తామని, ఇప్పటికే నిత్యవసర వస్తువులు మండిపోతున్నాయని కానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ ఏ రకంగాను పట్టించుకోవటం లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుట ధనార్జన దేయంగా పనిచేస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఏమో స్వాతంత్ర దర్యాప్తు సంస్థలను తమ గుప్పెట్లో పెట్టుకొని భాజాపాకు వ్యతిరేకంగా ఉన్న వారిపై దాడులు నిర్వహిస్తుందని అలాగే కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తుందని తెలిపారు. ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ కార్యకర్తలందరూ సమిష్టిగా ఉండి గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని ఆయన కోరారు.