బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి

నవ తెలంగాణ-జక్రాన్ పల్లి : జక్రాన్ పల్లి మండలం పుప్పాలపల్లి గ్రామంలో తౌడ కాషామని భర్త గంగాధర్ ,  ఇల్లు సోమవారం రోజున షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో ఉన్నా వస్తువులు, టీవీ, నిత్యావసర సరుకులు కాలిపోయాయి. దాదాపు రెండు లక్షల వరకు  నష్టపరిహారం జరిగిందని కుటుంబీకులు తెలిపారు. విషయం తెలుసుకొని  శుక్రవారం రోజున వారి కుటుంబాన్ని ధర్పల్లి మాజీ ఎంపీపీ ముదిరాజ్ సంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇమ్మడి గోపి పరామర్శించి 10,000/- పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ధావుల పోసాని, సంతోష్, యాటకర్ల దేవేష్, గ్రామస్తులు, వివిధ గ్రామాల ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.