అవినీతి కేసులో పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ అరెస్టు

 Former Prime Minister of Pakistan in corruption case Imran arrestedఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తోషాఖానా అవినీతి కేసులో ఇస్లామాబాద్‌ జిల్లా, సెషన్స్‌ కోర్టు ఇమ్రాన్‌ను దోషిగా తేల్చుతూ తీర్పునిచ్చింది. ఈ అవినీతి కేసుపై సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి హుమయూన్‌ దిలావర్‌ ఇమ్రాన్‌ఖాన్‌కు మూడేండ్లపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే ఐదేండ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేశారు. ఈ కేసులో కోర్టు తీర్పు అనంతరం ఇమ్రాన్‌ శనివారం అరెస్టయ్యారు. అయితే కోర్టు తీర్పును ఇమ్రాన్‌ఖాన్‌ ఖండించారు. ఈ కేసులో అతని తరపున వాదించే న్యాయవాద బృందం వెంటనే అప్పీల్‌ దాఖలు చేయను న్నట్టు ఇమ్రాన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తరపున వాదించిన న్యాయవా ది ఒకరు మాట్లాడుతూ.. ‘ఈ కేసులో సాక్షులను హాజరుపరచడానికి మాకు అవకాశం ఇవ్వలేదు. వాదనలను పూర్తి చేయడానికి సమయం కేటా యించలేదు. మావైపు వాదనల్ని వినకుండానే కోర్టు తీర్పునిచ్చింది’ అని ఆయన అన్నారు. కాగా, ఇమ్రాన్‌ ప్రధానిగా ఉన్న సమయంలో విదేశీ ప్రముఖుల నుంచి తాను పొందిన విలువైన బహుమతులను తోషిఖానాలో జమ చేయకుండా.. వాటిని అక్రమంగా విక్రయించారని మాజీ ప్రధాని షెహబాజ్‌ ఆరోపించారు. ఈ తోషిఖానా అవినీతి కేసులో ఈ ఏడాది మే నెలలో ఇమ్రాన్‌ అరెస్టయి న సంగతి తెలిసిందే.