కారెక్కిన వళ్లెంకుంట మాజీ సర్పంచ్‌

Former Sarpanch of Karekkina Vallenkunta– ఆహ్వానించిన మంథని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్ట
నవతెలంగాణ-మల్హర్‌రావు
మండలంలోని వళ్లెంకుంట మాజీ సర్పంచ్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నా యకుడు ఐత తిరుపతిరెడ్డి తోపాటు పలువురు గురువారం కారెక్కారు. వారిని మంథని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్‌ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన బిఆర్‌ఎస్‌ మేనిపేస్టో, మంథని నియోజకవర్గంలో పుట్ట మదుకర్‌ చేస్తున్న అభివద్ధి పనులకు ఆకర్షణీయులై పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమితి అధ్యక్షుడు గొనె శ్రీనివాసరావు, బిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షు డు రాఘవ రెడ్డి,పీఎసిఎస్‌ చైర్మన్‌ రామారావు,యూత్‌ అధ్యక్షుడు జాగరి హరీష్‌, సర్పంచ్‌ శనిగరపు రమేష్‌, సిద్ది లింగమూర్తి, వరద సభ్యుడు రమేశ్‌, తాజాద్దీన్‌, కో ఆప్షన్‌ ఆయూబ్‌ ఖాన్‌ పాల్గొన్నారు.