రూ.2 కోట్ల 65 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నవతెలంగాణ కమ్మర్ పల్లి: మండలంలోని ఉప్లూర్, రాజరాజేశ్వరి నగర్ గ్రామాల్లో సోమవారం రూ.2 కోట్ల 65 లక్షలతో చేపట్టనున్న  అభివృద్ధి పనులకు రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.కమ్మర్ పల్లి, ఏర్గట్ల మండలం తడ్ పాకల్ రోడ్ పై రాజరాజేశ్వరి నగర్ గ్రామ శివారులో రూ.కోటి 12లక్షలతో  న్యారో బ్రిడ్జి  వెడల్పు పనులకు శంకుస్థాపన చేశారు.ఉప్లూర్ లో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించి  రూ.కోటి 55 లక్షలతో ఉప్లూర్, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామాల మధ్య బిటి రోడ్డు రెన్యువల్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అధ్యక్షురాలు గౌతమి,  సర్పంచ్ లు  బద్దం పద్మ చిన్నారెడ్డి, అమర గోని రోజా సదాశివ గౌడ్,
ఎంపీటీసీ సభ్యుడు పిప్పేర అనిల్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ బద్దం రాజేశ్వర్, రైతు రాష్ట్ర నాయకులు కోటపాటి నరసింహనాయుడు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాజారామ్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, గ్రామ శాఖ అధ్యక్షులు అవారి మురళి, పంచాయతీరాజ్ డిఈ రాజేశ్వర్, ఏఈ  విక్రమ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు