బస్వాయిపల్లి రోడ్డు పనులకు శంకుస్థాపన

నవతెలంగాణ – నసురుల్లాబాద్
మండల పరిధిలోని బస్వాయి పల్లి గ్రామం నుంచి చౌటకుంటా చెరువు వరకు రోడ్డు పనులకు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్ రోడ్డు పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల్లో తగిన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామానికి ఉన్న ఒక్క చెరువు కట్ట, వ్యవసాయ రైతులకు రోడ్డు సక్రమంగా చేయలేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్న సమస్యలను వివరించడంతో వెంటనే నిధులు మంజూరు చెయ్యడంతో పనులకు భూమి పూజ చెయ్యడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పి కో అప్షన్ మెంబర్ మజీద్, సర్పంచ్ రెహన్, నాయకులు తదితరులు ఉన్నారు.