విద్యార్థులకు ఉచిత అటో ప్రయాణం

నవ తెలంగాణ-పెద్దకొడప్ గల్:
మండలంలోని పోచారం గ్రామ పంచాయతీ పరిధిలోని రాం రావు మహరాజ్ తండాకు చెందిన విద్యార్థుల చదువుకోసం 3 కి.మీ.కాలినడకతో రోజు ప్రయాణం చేస్తున్నట్లు గతంలో పలు దిన పత్రికలలో చదవులమ్మలకు ఎన్నో కష్టాలు అనే శిరీక రావడం చూసి పోచారం తండాకు చెందిన పవార్ రాం సింగ్ స్వచ్ఛందగా తన వంతుగా విద్యార్థుల కోసం  ప్రత్యేక ఆటోను తన సొంత ఖర్చుతో విద్యార్థుల ప్రయాణం కోసం  సిద్ధం చేసి బడికి పంపుతున్నట్లు తెలిపారు. దింతో తాండ వసూలు మాట్లాడుతూ మా విద్యార్థుల కష్టాన్ని చూసి ముందుకు వచ్చి  ఉచిత ఆటో తన వంతుగా సహాయం చేస్తున్న పవర్ రాంసింగ్ ను ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తాండ వసూలు యువకులు పాల్గొన్నారు.