పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నీట్‌పై బాలికలకు ఉచిత అవగాహన తరగతులను నిర్వహించనున్నట్టు మెటామైండ్ అకాడమీ డైరెక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను ఆదివారం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ జూన్ 3, 4, 5 తేదీల్లో మూడు రోజు పాటు హైదరాబాద్ దోమలగూడలోని మెటామైండ్ నీట్ అకాడమీలో తరగతులుంటాయని తెలిపారు. బాలికల కోసం ఉచిత హాస్టల్ వసతితో 120 మందికి నీట్ సాధనలో ఎదురయ్యే సవాళ్లు, మెటార్‌షిప్, టెస్ట్ సిరీస్, తదితర నూతన ప్రిపరేషన్ విధానం ద్వారా నీట్‌లో విజయం ఎలా సాధించవచ్చో వివరిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు 85229 58575లో సంప్రదించాలని సూచించారు.