ఉచిత కంటి పరీక్షల శిబిరం..

నవతెలంగాణ- కమ్మర్ పల్లి 
మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం లయన్స్ క్లబ్ నిజామాబాద్ వారి  ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. కంటి పరీక్షల శిబిరాన్ని సర్పంచ్ సర్పంచ్ సక్కారం అశోక్ ప్రారంభించారు. శిబిరంలో కంటి వైద్యులు ప్రతాప్ గౌడ్ 50మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 15 మందికి మోతే బిందు  కంటి ఆపరేషన్ లు అవసరమని గుర్తించారు. వీరికి నిజామాబాద్ లో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించినట్లు లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నిజామాబాద్ సభ్యులు, గ్రామస్తులు సర్గం, రవి, నారాయణ, గంగాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.