బిజ్జల్ వాడిలో పశువులకు ఉచిత వైద్యశిభిరం.

నవతెలంగాణ – జుక్కల్:  మండలంలోని  బిజ్జల్ వాడి గ్రామములో  పశువైద్య శాఖ ఆదేశాల మేరకు మండల  వెటర్నరి శాఖ ఆధ్వర్యంలో  పశువులకు  ఉచిత వైద్యశిభిరాన్ని  గ్రామసర్పంచ్ గౌళే యాదవ్  అద్యక్షతన బుదువారం నాడు ప్రారంబించినారు, వెటర్నరి వైద్యుడు  చికిత్సలు  నిర్వహించడం జర్గిందని జుక్కల్ మండల వెటర్నరి డాక్టర్ వై. పండరిి నాథ్ పేర్కోన్నారు.  ఈ సంధర్భంగా పశువుల  వైద్యుడు పండరినాథ్ మాట్లాడుతు గ్రామములోని  51 పశువులకు గర్భకోశ వ్యాదుల చికిత్స చేసామని, 33 పశువులకు సాదారాణ చికిత్సలు చేయడం  జర్గిందని, 27 దూడలకు నట్టల  నివారణ మందులు వేయడం వేసామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ గౌళే యాదవ్, మండల పశువుల డాక్టర్ పండరినాథ్, గోపాల మిత్ర సూపర్ వైజర్ బస్వరాజ్, గోపాల మిత్రులు సంజీవ్, అంజయ్య , పాడీ రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గోన్నారు.