రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వృద్ధులకు ఉచిత వైద్య శిబిరం

నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండలంలోని ముధక్ పల్లి గ్రామంలో. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధులకు ఉచిత వైద్య చికిత్సను మంగళవారం రోజున ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది వృద్ధులకు సరైన సమయంలో గ్రామీణ ప్రాంతాలలో సరైన చికిత్స అందడం లేదని. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య చికిత్సలు అందించడం జరిగింది. షుగర్ మరియు బిపి వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాగుల సుజాత ఉపసర్పంచ్ సాంబయ్య గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లేష్ ఏఎన్ఎం పుష్ప తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.