‘సీఎంఆర్‌’ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

నవతెలంగాణ-మేడ్చల్‌
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని సీఎంఆర్‌ ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు.గురువారం మేడ్చల్‌ మున్సిపల్‌ పరిధిలోని 6వ వార్డులో సీఎంఆర్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని స్థానిక కౌన్సిలర్‌ రామన్నగారి మణికంఠ గౌడ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక వార్డు ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. కౌన్సిలర్‌ మాట్లాడుతూ వార్డు అభివద్దే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మెన్‌ గోపాల్‌ రెడ్డి, అలి బేఫ్‌, దుర్గా ప్రసాద్‌ రెడ్డి, మధు యాదవ్‌, వైద్యులు రియాజ్‌, పవన్‌, సంతోషిని, వార్డు ప్రజలు సంతోష్‌ గౌడ్‌, మోనార్క్‌, శ్రీను,సాయి,వినరు తదితరులు పాల్గొన్నారు.