రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

నవతెలంగాణ- ఆర్మూర్:  రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో అధ్యక్షులు పట్వారి గోపికృష్ణ అధ్యక్షతన పట్టణంలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డాక్టర్ నరేష్ కుమార్ మయూరి హాస్పిటల్  సౌజన్యంతో విద్యార్థులకు శనివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ కుమార్ గారు మాట్లాడుతూ విద్యార్థులందరూ ప్రతినిత్యం పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా విటమిన్ ఏ డి కి సంబంధించిన ఆహారం పండ్లు కూరగాయలు పాలు గుడ్లు వంటి ఆహార పదార్థాలు ప్రతిరోజు తీసుకోవాలి, నేత్రానికి సంబంధించిన ఆరోగ్య పరీక్షలు సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్ ని  సంప్రదించాలని సూచించారు. అదేవిధంగా ప్రతి విద్యార్థికి నేత్ర పరీక్షలు చేసి ఉచితంగా వారికి ఐ డ్రాప్స్, మందులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనరసయ్య గారు మాట్లాడుతూ రోటరీ సేవలు నేటి సమాజానికి చాలా అవసరం అని వారు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరం వారికి ఎంత ఉపయోగపడుతుందని, రోటరీ బృందానికి డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి పట్వారి తులసి, ప్రాజెక్ట్ చైర్మన్ గోనె దామోదర్, రోటరి మాజీ అధ్యక్షులు  ప్రవీణ్ పవర్ పుష్పాకర్ రావు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.