నవతెలంగాణ-బంజారాహిల్స్
ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సుమారు 40 శాతానికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారనీ, అలాంటి వారికి షహీ న్ అకాడమీ తో కలిసి ఉచితంగా ఆన్ లైన్ శిక్షణ ఇవ్వనున్నట్టు సోషల్ డేటా ఇన్షియేటివ్ ఫోరం (ఎస్ డి ఐఎఫ్) ఖలీద్ సైఫుల్లా తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఫ్రీ సప్లమెంటరీ కోచింగ్ డాట్ కాంను మహమ్మద్ ఇంతియాజ్ అంజాద్ ఆయేషా రుబీనా ఇబ్రహీం కాళ్ళతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఏడాది రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజ రు కాగా అందులో 2 లక్షల పై చిలుకు ఉత్తీర్ణత సాధించగా, లక్షా యాభై మూడు వేల మంది ఫెయిల్ అయ్యారని తెలిపారు. పరీక్షల్లో విజయం సాధించని విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారనీ, అలాంటి వారికి నిష్ణాతులైన అధ్యాపకులతో ఆన్లైన్ ద్వారా అన్ని సబ్జెక్టుల్లో పూర్తి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు తమ వెబ్సైట్ ద్వారా శిక్షణ పొందవచ్చునని చెప్పారు. మరిన్ని వివరాల కోసం 8927911911 నెంబర్లో సంప్రదించాలని తెలిపారు.