స్నేహభవమే, ఐక్యతే భవిష్యత్తులో గ్రామభివృదికి తోడ్పాడుతుంది

– ఘనపూర్ ప్రీమియం లీగ్ విన్నర్, రన్నర్ టీమ్ లకు బహుమతి ప్రధానం..
– డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ..
నవతెలంగాణ – డిచ్ పల్లి

స్నేహభవమే, ఐక్యతే భవిష్యత్తులో గ్రామభివృదికి మంచి తోడ్పాడుతుందని అవుతుందని,ఈ రోజుల్లో యువత ఫోన్లో నిమగ్నం అవుతున్నారని, అలాంటి సమయంలో ఘనపూర్ యువత వినూత్నంగా అలోచించి 30 రోజులు గ్రామంలో ఉన్న 150 మంది యువకులను శారీరకంగా, మానసికంగా వారిని ఉతేజపరిచడానికి క్రికెట్ ప్రిమియర్ లిగ్ నిర్వహించాడం అబినందనమని డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ అన్నారు.ఘనపూర్ ప్రీమియం లీగ్ విన్నర్, రన్నర్ టీమ్ లకు బహుమతి ప్రధానం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎక్కడెక్కడో చుదువుకునే యువకులను విద్యార్థులను ఒక్క చోటుకి తెచ్చి వారి మధ్య స్నేహాభావన్నీ పెంచాడం, ఈ స్నేహభవమే, ఈ ఐక్యతే భవిష్యత్తులో గ్రామభివృదికి తోడ్పాటు అవుతుందని అన్నారు. యువత చెడు వ్యాసనాలకు గురి కావద్దని, గ్రామంలో ప్రతి ఒక్కరు చదువుకునేలా యువకులు కృషి చేయాలాన్నారు.ఎస్ఐ కచ్చకాయల గణేష్ మాట్లాడుతూ గ్రామంలో యువత పక్కదోవ పట్టకుండా జిపిఎల్ క్రికెట్ లీగులు పెట్టి చాలా మంచి పని చేశారన్నారు. అంతే కాకుండ శాంతి భద్రతలకు బంగం కలగకుండా యువకుల ప్రధాన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. విన్నర్ టీమ్ ఓం టీమ్ కు రన్నర్ టీమ్ సాయినాధ్ టీమ్ కు మెమంటోస్ అందజేశారు. ఈ కార్యక్రమం లో రామకృష్ణ, డైరెక్టర్ సతీష్ రెడ్డి మహేష్ ,ముత్యన్నా ఎన్నోళ సాగర్, రాంచందర్, నర్సయ్య, ఓం ప్రసాద్, దాస్, హరీష్, తోపాటు తదితరులు పాల్గొన్నారు.